- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Thalapathy market in Telugu Film Industry gross collections details Telugu Heroes Photos
Vijay Thalapathy: దళపతి దండయాత్ర.. తెలుగులో విజయ్ చివరి 7 సినిమాల్లో 6 హిట్..
దండయాత్ర.. ఇది దళపతి దండయాత్ర అన్నట్లే ఉంది ఇఫ్పుడు పరిస్థితి. ఎందుకంటే విజయ్ సినిమా వచ్చిందంటే చాలు తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అసలు ఒకప్పుడు ఈయన సినిమాలెవరు చూస్తారు.. యాక్టింగ్ రాదంటూ చులకనగా చూసారు విజయ్‌ను. మరోవైపు తమిళంలో సూపర్ స్టార్ డమ్ ఉన్నా తెలుగు మార్కెట్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు విజయ్. తన తర్వాత వచ్చిన సూర్య, అజిత్, కార్తి సహా చాలా మంది హీరోలు..
Updated on: Oct 25, 2023 | 5:05 PM

దండయాత్ర.. ఇది దళపతి దండయాత్ర అన్నట్లే ఉంది ఇఫ్పుడు పరిస్థితి. ఎందుకంటే విజయ్ సినిమా వచ్చిందంటే చాలు తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అసలు ఒకప్పుడు ఈయన సినిమాలెవరు చూస్తారు.. యాక్టింగ్ రాదంటూ చులకనగా చూసారు విజయ్‌ను.

మరోవైపు తమిళంలో సూపర్ స్టార్ డమ్ ఉన్నా తెలుగు మార్కెట్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు విజయ్. తన తర్వాత వచ్చిన సూర్య, అజిత్, కార్తి సహా చాలా మంది హీరోలు తెలుగులో మంచి మార్కెట్ తెచ్చుకున్నా.. విజయ్ మాత్రం తెలుగు వైపు చూడలేదు.

కానీ స్నేహితుడు నుంచి ఈయన సినిమాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. అప్పటి వరకు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేసిన ఈయన.. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రీమేక్స్ చేయడం మానేసాడు. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు.

ఫస్ట్ టైమ్ తుపాకి, పోలీసోడు సినిమాలతో ఓకే అనిపించిన విజయ్.. అదిరిందితో ఇక్కడ మార్కెట్ ఓపెన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రతీ సినిమా తెలుగులోనూ అనువాదం అయింది. మెర్సల్ తెలుగులో అదిరిందిగా వచ్చి తొలిసారి 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఆ తర్వాత వచ్చిన సర్కార్ సైతం 7 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు ఆట. మంచి అంచనాల మధ్య విడుదలైన విజిల్ 11 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఆ వెంటనే మాస్టర్ 2020 సంక్రాంతికి విడుదలై.. క్రాక్ లాంటి సినిమాను ఢీ కొట్టి మరీ 14 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.

బీస్ట్ అంచనాలు అందుకోకపోయినా.. 70 శాతం వరకు రికవరీ చేసింది. 12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బీస్ట్.. 7.50 కోట్ల షేర్ వసూలు చేసింది. వారసుడు అయితే ఏకంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో పోటీ పడి 14 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

తాజాగా లియో దసర సినిమాల్లో అన్నింటికంటే ముందు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 18 కోట్లకు పైగానే టార్గెట్ ఫిక్స్ చేసుకుని వచ్చిన లియో.. 5 రోజుల్లోనే 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. లోకేష్ కనకరాజ్ బ్రాండ్‌కు తోడు.. విజయ్ మార్కెట్ లియోకు కలిసొచ్చింది.

బాలయ్య, రవితేజ లాంటి హీరోలున్నా కూడా విజయ్ సినిమా దుమ్ము దులిపేసింది. దసరా సెలవుల తర్వాత కూడా అదే జోరు చూపిస్తుందా లేదా అనే విషయం పక్కనబెడితే ముందైతే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ లెక్కన అదిరింది, సర్కార్, విజిల్, మాస్టర్, వారసుడు తర్వాత లియోతో మరో హిట్ అందుకున్నాడు విజయ్.





























