Nayanthara: నయనతార 75 నాటౌట్.. లేడీ సూపర్ స్టారా మజాకా..! 100 కోట్ల రేసులో..
నయనతార.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. వయసు 40 వరకు వచ్చినా ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ ఈమె. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలోనూ వరస సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే బ్యూటీ నయన్. ఈ మధ్యే జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది నయనతార. అక్కడ మొదటి సినిమానే 1000 కోట్లకు పైగా వసూలు చేయడంతో అమ్మడి ఇమేజ్ అలా అలా పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు 15 కోట్లకు పైగానే తీసుకుంటుంది ఈ బ్యూటీ ఇప్పుడు.