- Telugu News Photo Gallery Cinema photos Battle between beauty queens Shruti Haasan and Taapsee Pannu
Shruti Haasan Vs Tapsee: ఒకేరోజు బరిలోకి బ్యూటీ క్వీన్స్ శృతి, తాప్సి.. విజయం ఎవరిని వరించనుందో..
డిసెంబర్ 22న జరిగే ఫైట్‌ని అందరూ షారుఖ్ వర్సెస్ ప్రభాస్‌గానే చూస్తున్నారు. కానీ గ్లామర్ వరల్డ్ మీద ఫోకస్ చేసే వారు మాత్రం ఆ ఫైట్ ఇద్దరు బ్యూటీ క్వీన్స్ మధ్య అని చెబుతున్నారు. సలార్‌లో శ్రుతి, డంకీలో తాప్సీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్ వార్ గురించి చూసేద్దాం రండి. నార్త్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ, ప్రొడ్యూసర్‌గానూ బిజీ అవుతున్నారు తాప్సీ. సలార్‌లో ప్రభాస్‌తో జోడీ కడుతున్నారు శ్రుతిహాసన్.
Updated on: Oct 25, 2023 | 11:46 AM

డిసెంబర్ 22న జరిగే ఫైట్‌ని అందరూ షారుఖ్ వర్సెస్ ప్రభాస్‌గానే చూస్తున్నారు. కానీ గ్లామర్ వరల్డ్ మీద ఫోకస్ చేసే వారు మాత్రం ఆ ఫైట్ ఇద్దరు బ్యూటీ క్వీన్స్ మధ్య అని చెబుతున్నారు. సలార్‌లో శ్రుతి, డంకీలో తాప్సీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్ వార్ గురించి చూసేద్దాం రండి.

నార్త్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ, ప్రొడ్యూసర్‌గానూ బిజీ అవుతున్నారు తాప్సీ. చాలా రోజుల తర్వాత షారుఖ్‌లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆల్రెడీ పఠాన్, జవాన్‌తో సక్సెస్ మీదున్న షారుఖ్, ఈ డిసెంబర్‌లో డంకీని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డంకీ మీద నార్త్ నుంచి సౌత్ వరకు చాలా మందిలో మంచి హోప్స్ ఉన్నాయి.

డంకీ ఓవర్సీస్‌లో డిసెంబర్ 21న, మన దగ్గర డిసెంబర్ 22న విడుదలకు ఫిక్స్ అయింది. డిసెంబర్ 22న నేను కూడా రంగంలోకి దూకుతున్నాను అని ఆల్రెడీ ప్రకటించారు సలార్ ప్రభాస్. ఈ డిసెంబర్ గతంలా ఉండదు. సరికొత్తగా ఉంటుంది అంటూ ఆడియన్స్ లోనూ అదో రకమైన ఆసక్తి క్రియేటైంది.

సలార్‌లో ప్రభాస్‌తో జోడీ కడుతున్నారు శ్రుతిహాసన్. షూటింగ్ పూర్తయినప్పటి నుంచి ఈ టీమ్‌ని మిస్ అవుతూ ఉన్నానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు శ్రుతిహాసన్. ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో రెండు హిట్లు అందుకున్నారు సుగుణ సుందరి శ్రుతిహాసన్.

డిసెంబర్ 22న ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో సలార్ హిట్ అయితే 2023ని హ్యాట్రిక్ హిట్స్ ఇయర్‌గా అనౌన్స్ చేయాలని తహతహలాడుతున్నారు శ్రుతి. డార్లింగ్‌కి ఒక్క హిట్ పడితే చూడాలని ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో, తన హ్యాట్రిక్ హిట్ కోసం శ్రుతి కూడా అంతే ఈగర్‌గా వేచి చూస్తున్నారు. తాప్సీ, వర్సెస్ శ్రుతి అంటూ జరుగుతున్న పోటీలో ఇద్దరూ నెగ్గుతారా? ఇద్దరిలో ఒకరే నెగ్గుతారా? అనే ఇంట్రస్ట్ బాగానే క్రియేటైంది జనాల్లో.




