మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంట వారసుడు/ వారసురాలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గర్భంతో ఉన్న ఉపాసనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది మెగా ఫ్యామిలీ. ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశౄల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. తాజాగా ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్ వంటకాన్ని తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఉపాసన కోసం అంజనా దేవి దగ్గరుండి వంట చేయడం మనం చూడవచ్చు. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరించడం, ఎలా వేయాలో ఎంత వేయాలో అంజనమ్మ చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన ఉపాసన.. దీనికి ఓ స్పెషల్ నోట్ ను రాసుకొచ్చింది. ‘నాయనమ్మ ప్రేమతో నిండిపోయిన సండే స్పెషల్ పులావ్, ఇంతకంటే నాకేం కావాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. మెగా కోడలి ప్రేమకు, అంజనమ్మ కేరింగ్‌కు అంతా ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. ??? pic.twitter.com/EegIdtsU80
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..