టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి జీవిత కథ ఆధారంగా ఇటీవలే ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రిలీజైంది. మోడ్రన్ మాస్టర్ తో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజమౌళి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇందులో చూపించారు మేకర్స్. ముఖ్యంగా రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళిల ప్రేమ వివాహం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. కాగా రమాకి రాజమౌలి రెండో భర్త అని తెలిసిందే. రమాకు వివాహమై కార్తికేయ పుట్టిన తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాజమౌళి పరిచయం కావడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చకా చకా జరిగిపోయింది. కాగా రాజమౌళితో ప్రేమ వివాహంపై మాట్లాడిన రమా.. ‘రాజమౌళిని మొదటిసారి మా అక్క పెళ్లిలో చూసాను. అప్పుడు నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదు. అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. రాజమౌళినే నాకు మొదట లవ్ ప్రపోజ్ చేసాడు. కానీ నేను నో చెప్పాను. నాకు అప్పటికే విడాకులు అయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా ఉన్నాడు. దీంతో ఏడాది తర్వాత మేము ఇద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నాం’ అని చెప్పుకొచ్చాడు.
ఇదే విషయంపై రమా రాజమౌళి తనయుడు కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆయన నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా పరిచయం. చిన్నప్పుడు నన్ను, మా ఫ్యామిలీ కజిన్స్ పిల్లల్ని బయటకి తీసుకెళ్లెవారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీలో రాజమౌళి ప్రపంచ సినిమా పై ఏ విధంగా తన ముద్ర వేశారో చాలా చక్కగా చూపించారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్, జో రుసో, కరణ్ జోహార్ లాంటి సినిమా దిగ్గజాలు వివిధ సందర్భాల్లో రాజమౌళి గురించి పంచుకున్న అభిప్రాయాలను ఇందులో చూపించారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, రణ్ బీర్ కపూర్ తదితరులు జక్కన్న గురించి పంచుకున్న పలు ఆసక్తికర విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని అనుపమ చోప్రా సమర్పించారు.
The Art vs The Artist #ModernMastersOnNetflix @ssrajamouli pic.twitter.com/44Pul4g5cd
— Netflix India (@NetflixIndia) August 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.