Ismart Shankar: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ సినిమా.. ఇస్మార్ట్ శంకర్ వ్యూస్ చూస్తే మతిపోవాల్సిందే..

|

Feb 27, 2022 | 10:15 AM

టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో ముందువరుసలో ఉంటాడు కుర్ర హీరో రామ్. దేవ్ దాస్ సిఇనిమతో హీరోగా పరిచయం అయిన రామ్.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Ismart Shankar: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ సినిమా.. ఇస్మార్ట్ శంకర్ వ్యూస్ చూస్తే మతిపోవాల్సిందే..
Ram
Follow us on

Ismart Shankar: టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు కుర్ర హీరో రామ్. దేవ్ దాస్ సిఇనిమతో హీరోగా పరిచయం అయిన రామ్.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. చాలా కాలం తర్వాత  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కిరాక్ హిట్ అందుకున్నాడు రామ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ డిఫరెంట్ లుక్.. బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా రామ్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.  ఈ సినిమాలో నిధి అగర్వాల్, అందాల భామ నభానటేష్ హీరోయిన్స్ గా నటించారు. థియేటర్ లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ లో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇస్మార్ట్ శంకర్ హిందీ వర్షన్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చాయి.. మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఈ సినిమా ఆదరించారు. తాజాగా ఈ సినిమాను అన్ని పలు భాషల్లో వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో అందుబాటులోకి వచ్చింది. అన్ని యూట్యూబ్ ఛానల్స్ కలిపి ఈ సినిమాను బిలియన్ల మంది చూసారని తెలుస్తుంది. దాంతో ఈ యంగ్ హీరోకి అన్ని భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం రామ్ చేస్తున్న ‘ది వారియర్’ సినిమాను తమిళంతో పాటు హిందీలోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి అలరించనుంది. ,మరి ఈ సినిమా ఏ  స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagababu: ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్‌ ఫైర్‌.. పవన్‌పై పగ బట్టిందంటూ ఘాటు విమర్శలు..

Bigg Boss Non-Stop: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షురూ.. బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొదలైంది.

Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..