Boyapati Srinu: యంగ్ హీరో కోసం మాస్ మసాలా కథను సిద్ధం చేసిన బోయపాటి..

|

Aug 30, 2021 | 2:08 PM

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేయడానికి హీరోలంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బోయపాటి హీరో ఎలివేషన్స్, ఫైట్స్ కు టాలీవుడ్ లో యమా క్రేజ్..

Boyapati Srinu: యంగ్ హీరో కోసం మాస్ మసాలా కథను సిద్ధం చేసిన బోయపాటి..
Boyapati Srinu
Follow us on

Boyapati Srinu: టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేయడానికి హీరోలంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బోయపాటి హీరో ఎలివేషన్స్, ఫైట్స్ కు టాలీవుడ్ లో యమా క్రేజ్ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న బోయపాటి.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే కన్నడ స్టార్ యశ్ కు ఇటీవల బోయపాటి కథ చెప్పాడని యశ్  సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఈ యాక్షన్ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రామ్ కు విపరీతమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా.. రామ్ ను ఉస్తాద్ గా మార్చేసింది. ఆతర్వాత రెడ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామి తో కంప్లీట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు బోయపాటి  సినిమాను ఓకే చేశాడట రామ్. ఆల్రెడీ ఆయన రామ్ కి కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఇది కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉంటుందని చెబుతున్నారు. బోయపాటి చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ – ఎమోషనల్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రామ్ కోసం అలాంటి కథనే సిద్ధం చేశారట. లింగుసామి దర్శకత్వంలో రామ్  చేస్తున్న సినిమా పూర్తికాగానే ఆయన చేయనున్న సినిమా ఇదేనని అంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత బన్నీతో బోయపాటి సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.  ఈ సినిమాను  దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shakuntalam: అంచనాలు పెంచుతున్న గుణశేఖర్ సినిమా.. అక్కడి ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేస్తుందిగా

RGV Rewind: అరియానాకు వర్మ ఇచ్చిన భరోసా ఏంటి.. ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో).

Tollywood: 2022 ప్రేక్షకులకు పండగే.. ట్రిపుల్‌ ధమాకా ఇవ్వనున్న స్టార్ హీరోలు వీరే..