Ram Pothineni: ఈ సారి నెక్స్ట్ లెవల్‌.. భారీ బడ్జెట్‌తో రామ్ పోతినేని, పూరిజగన్నాథ్ సినిమా..?

పూరిజగన్నాథ్ యంగ్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అప్పటివరకు ఫ్లాప్ లతో సతమతం అవుతున్న రామ్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది.

Ram Pothineni: ఈ సారి నెక్స్ట్ లెవల్‌.. భారీ బడ్జెట్‌తో రామ్ పోతినేని, పూరిజగన్నాథ్ సినిమా..?
Ram , Puri Jagannadh

Updated on: Jul 03, 2023 | 11:15 AM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. యువతను ఆకట్టుకోవడం ఎలా అన్నది పూరికి బాగా తెలుసు. ఆయన సినిమాలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్, డైలాగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పూరిజగన్నాథ్ యంగ్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అప్పటివరకు ఫ్లాప్ లతో సతమతం అవుతున్న రామ్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాలో రామ్ మాస్ మసాలా క్యారెక్టర్ లో అదరగొట్టాడు. తెలంగాణ యాసలో రామ్ రామ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ శంకర్ సినిమాకు ఈ మూవీ సీక్వెల్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కు సరైన హిట్ దక్కలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి.

అటు పూరిజగన్నాథ్ కూడా మంచి హిట్ దక్కలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు పూరిజగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో రానున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సుమారు 40 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్. త్వరలోనే ఏ ఈసినిమాను పట్టాలెక్కించనున్నారట. అలాగే రామ్ ఒకొక్క సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ త్వరలో ప్రకటించనున్నారు.