Ram Pothineni : షూటింగ్ కు సిద్దమవుతున్న రామ్.. వచ్చే నెలలో సెట్స్ పైకి లింగుస్వామి సినిమా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సాలిడ్ హిట్ ను అందించాడు.

Ram Pothineni : షూటింగ్ కు సిద్దమవుతున్న రామ్.. వచ్చే నెలలో సెట్స్ పైకి లింగుస్వామి సినిమా
Ram

Updated on: Jun 02, 2021 | 8:00 AM

Ram Pothineni :

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సాలిడ్ హిట్ ను అందించాడు. పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో భారీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో లవర్ బాయ్ గా ఇమేజ్ ఉన్న రామ్ మాస్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో సినిమా చేసాడు. రెడ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ డ్యూయల్  రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రామ్ లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో  కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథనే

ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ పాటికే ఈ సినిమా షూటింగు కొంతవరకూ పూర్తికావలసింది. కానీ కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లలేదు. కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో, వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేయించిన లింగుస్వామి, ఇతర పనులపై దృష్టిపెట్టాడని అంటున్నారు. రామ్ -కృతి జంట తెరపై ఎలా అలరిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి

గంగిరెద్దును ఆడిస్తు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యువకుడు.వైరల్ గా మారిన వీడియో :GV Prakash Video.

Chiranjeevi Oxygen Bank: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కు చిన్నారి అన్షి లక్ష రూపాయల విరాళం…