
వ్యూహం, శపథం సినిమాల తర్వాత కాస్త సైలెంట్ అయిపోయారు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ మధ్యన ప్రేక్షకులే అన్ని నిర్ణయించి సినిమా తీస్తే ఎలా ఉంటుందని యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్టుతో వార్తల్లో నిలిచాడు. అంటే ఆడియెన్సే సినిమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని టెక్నీషియన్లు ఎంచుకోవాలని, ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నవారితో తానే నిర్మాతగా సినిమా తీస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. మరి ఈ కాన్సెప్ట్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ తాజాగా ఒక ఆసక్తికరమైన వార్తతో మన ముందుకు వచ్చాడు ఆర్జీవీ. అదేంటంటే.. రామ్ గోపాల్ వర్మను సెన్సేషనల్ డైరెక్టర్ గా మార్చిన సినిమా శివ. ఈ సినిమాతోనే అక్కినేని నాగార్జునను స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. నాగార్జున సతీమణి అమలా ఇందులో కథానాయికగా నటించింది. అలాగే జేడీ చక్రవర్తి ఇందులో విలన్ గా కనిపించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శివ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది . డైరెక్టర్ ఆర్జీవీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు ఆర్జీవీ. ఇందులో శివ సినిమాలో నాగార్జున స్టైల్ లో సైకిల్ తెంచుతూ కనిపించారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ డైరెక్టర్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb
— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024
కాగా ఇటీవల కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని కలిశారు ఆర్జీవీ. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా మూవీ వస్తుందా? అని అభిమానులు ఊహించుకున్నారు. అయితే అదేమీ లేదని క్యాజువల్ గానే మక్కల్ సెల్వన్ ను కలిసినట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
After seeing him many times on SCREEN, I finally met the REAL @VijaySethuOffl to realise that he is even BETTER in REAL than on SCREEN pic.twitter.com/NW3KOktnlr
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.