
మరికొన్ని గంటల్లో (జూన్ 4) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వైఎస్సార్ సీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందా? అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే విజయం ఎవరికీ అంత ఈజీ కాదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కొన్ని సంస్థలు వైసీపీదే గెలుపు అని తేల్చగా, మరికొన్ని సంస్థలు ఎన్టీయే కూటమిదే అధికారం అని అంచనా వేశాయి. ఈ క్రమంలో మంగళవారం ( జూన్ 4న )ఎలాంటి ఫలితాలు రానున్నాయనే టెన్షన్ పీక్స్ కు చేరింది. ఈనేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ఫలితాలపై ఒక అంచనా వేశాడు. 100 శాతం కచ్చితత్వంతో కూడిన ఒక సర్వేను విడుదల చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. సిరా శ్రీ అనే ట్విట్టర్ యూజర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై ‘నా ఎగ్జిట్ పోల్’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు అంటూ వేర్వేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను రిలీజ్ చేశాడు. వైసీపీ, కూటమి ఏదైనా 0 నుంచి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవవచ్చని.. అలాగే లోక్ సభ విషయానికి వస్తే వైసీపీ, టీడీపీ కూటమి ఏదైనా సున్నా నుంచి 25 స్థానాల మధ్య గెలవొచ్చంటూ సైటిరికల్ గా ట్వీట్ చేశారు. ‘ఏ సర్వే అయినా అంచనా తప్పు కావచ్చేమో కానీ.. నా అంచనా మాత్రం వందశాతం కరెక్ట్ అవుతుంది’ అంటూ ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఇదే అత్యంత కచ్చితమైన, వందశాతం నమ్మదగిన సర్వే అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
This has to be the MOST ACCURATE SURVEY 🙏🙏🙏 https://t.co/XllDH47M3X
— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2024
కాగా వైసీపీకి మద్దతుగా నిలిచిన ఆర్జీవీ సీఎం జగన్ బయోపిక్ పై వ్యూహం, శపథం అనే సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.
Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb
— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.