మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 16న అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తొలి రోజునుంచే రికార్డులు బ్రేక్ చేస్తోంది అవతార్ 2. ఈ సినిమా విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే అవతార్ 2 సినిమా విడుదలకు ముందే పలు వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చింది. పైరసీ అయినా కూడా ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఇక తొలిరోజే రికార్డులను క్రియేట్ చేసింది అవతార్ 2. జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సంచలనాలు సృష్టిస్తుంది.
ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అవతార్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా అవతార్ 2 సినిమా చూసిన ఆర్జీవీ.. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అవతార్ 2లో ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు వర్మ. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉందనీ.. దేవుడు మనం నివసించే ఈ విశ్వాన్ని సృష్టిస్తే కామెరున్ “పండోరా” అనే ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు అని అన్నారు వర్మ. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే నటన, సూపర్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు వర్మ. జేమ్స్ కామెరున్ సృష్టించిన పండోర అనే ఈ అద్భుత ప్రపంచంలో ఉండాలని ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత స్వర్గం అంటే ఇలానే ఉంటుందని చెబితే మనుషులు అందరూ ఇప్పటికిప్పుడు చనిపోతారు అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చారు వర్మ.
After seeing AVATAR 2 , if somebody can assure that heaven will look anywhere like PANDORA the entire human species will DIE immediately
— Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చూడండి..