AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: డైరెక్టర్ అవ్వకముందు రోజూ ఆ హీరోయిన్ ఇంటి ముందు నిలబడేవాడిని : ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆర్జీవీ తన సినిమాలతో యూత్ ను తెగ ఆకట్టుకున్నాడు. ఆర్జీవీ సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఒకప్పుడు ఆర్జీవీ సినిమాలకు ఇండస్ట్రీని ఊపేశాయి

RGV: డైరెక్టర్ అవ్వకముందు రోజూ ఆ హీరోయిన్ ఇంటి ముందు నిలబడేవాడిని : ఆర్జీవీ
Rgv
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2026 | 12:42 PM

Share

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తన శారీ సినిమా నేపథ్యం, అబ్సెషన్‌ (ఉన్మాదం), స్టాకింగ్‌( వెంటపడటం, ఆమె అనుమతి లేకుండా చూడటం) వంటి వాటిపై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో నిజం, అబద్ధం, మీమ్స్‌ వంటి వాటి మధ్య వ్యత్యాసం గుర్తించడం కష్టమని ఆయన అన్నారు. అబ్సెషన్‌ అనేది బలమైన ఎమోషన్ తో ఉంటుంది. దీనిని క్లారిటీగా వివరించడం సాధ్యం కాదని ఆర్జీవీ పేర్కొన్నారు. కొన్నిసార్లు స్టాకింగ్‌ చేసే వారిపై జాలి కూడా కలగొచ్చని, ఎందుకంటే వారు మనుషులే అని ఆయన అన్నారు. ఒక అమ్మాయి మొదట్లో అటెన్షన్‌ను ఆస్వాదించవచ్చు కానీ, అది శృతి మించినప్పుడు భయానకంగా మారుతుందని ఆర్జీవీ అన్నారు.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

అలాగే గతంలో రాజమండ్రిలో జరిగిన ఒక భయంకరమైన స్టాకింగ్‌ ఉదంతాన్ని ప్రస్తావించారు ఆర్జీవీ. ఒక కాలేజ్ అమ్మాయిని స్టాక్ చేసిన యువకుడు, పోలీసులు హెచ్చరించిన తర్వాత అతను వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రులను హత్య చేశాడు. అతన్ని కొడుతున్నప్పుడు కూడా అతని ముఖంలో ఎటువంటి భావోద్వేగం లేదని, ఆ అమ్మాయిపై అతనికి ఉన్న ఉన్మాదం అతనిని గుడ్డివాడిని చేసిందని ఆర్జీవీ వివరించారు.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

తాను కూడా ఒకప్పుడు స్టాకర్‌నే అని ఆర్జీవీ అన్నారు. తాను శివ సినిమాకు సిద్ధమవుతున్నప్పుడు, చెన్నైలోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు రెండు బ్లాకుల దూరంలో ఉన్న శ్రీదేవి ఇంటి ముందు నిలబడి చూసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. రోజూ అదే పని. అప్పుడు ఎవరూ తనను గుర్తించలేదని, అది తన అభిమానం మాత్రమేనని అన్నారు. అభిమానం, అబ్సెషన్‌ మధ్య తేడా గురించి మాట్లాడుతూ, రెండూ ఒకే దగ్గర మొదలైనా, అవి ఒక పర్టిక్యులర్ డిగ్రీ దాటిపోయి, మనిషి మిగతావన్నీ మర్చిపోయినప్పుడు అది అబ్సెషన్‌ అవుతుందని ఆర్జీవీ తెలిపారు. అబ్సెషన్‌ ప్రమాదకరంగా మారడానికి కారణం, అది వ్యక్తిని డెల్యూషనల్‌గా మారుస్తుందని, తను ప్రేమించిన వ్యక్తికి కూడా ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమని, కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని భావించే స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. ఈ డెల్యూషన్‌ ప్రమాదాన్ని సృష్టిస్తుందని ఆర్జీవీ వివరించారు

ఇవి కూడా చదవండి

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!