డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. నిత్యం ట్విట్టర్ వేదికగా తన ఇష్టానుసారం ట్వీట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇప్పటికే పలుమార్లు రాజకీయాలపై.. టీడీపీ.. జనసేనలపై ఆయన చేసిన ట్వీట్స్ వైరలవుతుంటాయి. దీంతో పవన్ అభిమానులు ఆర్జీవీని ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. అయినా వర్మ మాత్రం వెనక్కు తగ్గకుండా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆపరు. తాజాగా జనసేనాని ప్రచార రథం పై చేసిన ట్వీట్లతో మరోసారి చిక్కుల్లో పడ్డారు వర్మ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి గురించి వరుస ట్వీట్స్ చేస్తూ.. పవన్ అభిమానిగా చెప్తున్నా.. అంటూ సెటైర్లు వేస్తూ వస్తున్నాడు. “గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు” గా ముద్ర వేస్తారు. అంటూ వర్మ చేసిన ట్వీట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ క్రమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఏబీవీపీ విద్యార్థులు. స్వామి వివేకానంద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను కించపరిచే విధంగా వరుసగా ట్విట్టర్ లో వర్మ పోస్టులు చేస్తున్నారని.. ఆయనను అరెస్ట్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. మరోవైపు వర్మ చేసిన ట్వీట్స్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వర్మను ట్రోల్ చేస్తున్నారు.
“గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు” గా ముద్ర వేస్తారు. JAI Pk JAI JANA SENA pic.twitter.com/8zgEl58FfV
— Ram Gopal Varma (@RGVzoomin) January 24, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.