Mirai Movie: ‘మిరాయి’ సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ .. ఆ స్టార్ హీరో సినిమాతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటించిన మరో పాన్ ఇండియా సినిమా మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది.

Mirai Movie: మిరాయి సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ .. ఆ స్టార్ హీరో సినిమాతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Mirai Movie

Updated on: Sep 12, 2025 | 9:24 PM

తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్‌ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్‌ విలన్ పాత్రలో కనిపించడం విశేషం. రుతిక హీరోయిన్ గా నటించగా, మరో కీలక పాత్రలో సీనియర్ కథానాయిక శ్రియ యాక్ట్ చేసింది. హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలా భారీ అంచనాల మధ్య శుక్రవారం (సెప్టెంబర్ 12) న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన మిరాయ్ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తేజ సజ్జా ఖాతాలో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడినట్టేనని, విలన్ గా మంచు మనోజ్ అద్బుతంగా నటించాడని రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచే టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మిరాయ్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. చాలా రోజుల తర్వాత ‘మిరాయ్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ వచ్చిందని ఇది బిగ్ షాట్ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఇదే సందర్భంగా యంగ్ హీరో తేజ సజ్జాపై ప్రశంసలు కురిపించారు.

‘మిరాయ్ సినిమా ఇండస్ట్రీ హిట్. తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని, విశ్వప్రసాద్ బిగ్ షాట్ ఇచ్చారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదు. సినిమా స్టోరీ, VFX హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి.’ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా అదరగొట్టగా… నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ మెరిశారు. అలాగే శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం, తంజా కెల్లర్, రాజేంద్రనాత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌరా హరి స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.