AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ! క్లారిటీ ఇచ్చేశాడుగా..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే శారీ సినిమాతో మన ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వర్మ తన భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే ఆర్జీవీ ప్రభాస్ కల్కి సినిమాలో ఓ క్యామియో రోల్ లో మెరిశాడు.

Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ! క్లారిటీ ఇచ్చేశాడుగా..
Spirit Movie
Basha Shek
|

Updated on: Apr 05, 2025 | 11:40 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ పోలీస్ స్టోరీ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ‘స్పిరిట్’కు సంబంధించి మరో క్రేజీ రూమర్ నెట్టింట వైరలవుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా ఇదే విషయంపై ఆర్జీవీ స్పందించాడు. తన లేటెస్ట్ సినిమా ‘శారీ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వర్మ స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

స్పిరిట్ సినిమాలో నేను నటిస్తున్నానన్న వార్తలయితే నిజం కాదు. ఫస్ట్ దీని గురించి సందీప్ రెడ్డి వంగా నన్ను అడగలేదు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియవు. ఇక కల్కి సినిమా గురించి అంటారా! ఈ టీమ్‌లో చాలామంది నాకు తెలిసినవారే. వాళ్ల కోసమే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. చాలా సరదాగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటిది ఊహించలేదు. దాంతో వాళ్లందరూ సర్‌ప్రైజ్‌ ఫీలయ్యారు. నా పాత్ర వారికి బాగా నచ్చింది’ అని చెప్పుకొచ్చాడు వర్మ. తద్వారా స్పిరిట్ సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్తలను రూమర్లేనని కుండ బద్దలు కొట్టేశాడు.

ఇవి కూడా చదవండి

స్పిరిట్ కోసం కాస్టింగ్ కాల్

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?
వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?
ఆడవారిలో 'పురుష హార్మోన్' చేసే వింత మార్పులు.. అసలు కథ ఇదే!
ఆడవారిలో 'పురుష హార్మోన్' చేసే వింత మార్పులు.. అసలు కథ ఇదే!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ట్రైన్ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ ఎలా అంటే..?
ట్రైన్ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ ఎలా అంటే..?
ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ఈశా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
ఈశా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా
విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..