Ram Gopal Varma: మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. అసలు ఏం జరిగిందంటే?

శివ-4k సినిమా రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉంటోన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సడెన్ గా మెగా స్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పడం చర్చనీయంశంగా మారింది. ఈ మేరకు ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Ram Gopal Varma: మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. అసలు ఏం జరిగిందంటే?
Chiranjeevi, Ram Gopal Varma

Updated on: Nov 09, 2025 | 12:12 PM

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నాడు. అక్కినేని నాగార్జునను స్టార్ హీరోగా మార్చేసిన ఈ సినిమా నవంబర్ 14న మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మేరకు నాగార్జునతో పాటు డైరెక్టర్ ఆర్జీవీ కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు కూడా శివ-4k సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని ఆల్‌ద బెస్ట్‌ చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలు ఇప్పటికే వీడియోలు వదిలారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. ‘శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు. ఒక విప్లవం. ఒక ట్రెండ్‌ సెట్టర్‌. శివ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పింది. ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. ఆ సైకిల్‌ చైన్‌ సీన్‌ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది. నాగార్జున ఇంటెన్స్ యాక్టింగ్, ఎనర్జీ ఫెంటాస్టిక్. అమల, రఘువరన్‌.. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు. ఈ మూవీ రీ-రిలీజ్ అవుతుందని తెలిసి సంతోషించాను. నేటి తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. ఇదో టైమ్‌ లెస్ ఫిల్మ్.. రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఈ యువ దర్శకుడు, తెలుగు సినిమా భవిష్యత్ అని అనిపించింది. హ్యాట్సాఫ్ టు రామ్ గోపాల్ వర్మ.. తెలుగు సినిమా ఉన్నంత కాలం శివ, చిరంజీవిలా చిరకాలం ఉంటుంది..’ అంటూ విషెస్ చెప్పారు చిరంజీవి.

ఇప్పుడు ఇదే వీడియోపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. చిరంజీవి వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేసిన ఆర్జీవీ.. ‘థ్యాంక్యూ చిరంజీవి గారు.. ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెబుతున్నా.. అనుకోకుండా నా మాటలు, చేతలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి.. మీ పెద్ద మనసుకి థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు.

కాగా గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశిస్తూ పలు సైటైర్లే వేశారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై తరచూ విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఇవేవీ మనసులో పెట్టుకోకుండా శివ రీ రిలీజ్ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. ఈ నేపథ్యంలో చిరంజీవికి క్షమాపణలు చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.

డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.