Virata Parvam Pre Release Event: విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్‏ రేపే.. అతిథులుగా ఆ ముగ్గురు స్టార్స్..

ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రూయనిట్. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్... ఆత్మీయ వేడుక అంటూ ప్రేక్షకులతో ముచ్చటించారు. తాజాగా

Virata Parvam Pre Release Event: విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్‏ రేపే.. అతిథులుగా ఆ ముగ్గురు స్టార్స్..
Virata Parvam 1

Updated on: Jun 14, 2022 | 2:22 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం విరాట పర్వం (Virata Parvam). న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రూయనిట్. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్… ఆత్మీయ వేడుక అంటూ ప్రేక్షకులతో ముచ్చటించారు. తాజాగా తాజాగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో మరో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ జూన్ 17న ఈ సినిమా కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జూన్ 15న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది విరాట పర్వం టీం.

ఈ వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హజరుకానున్నారు. 1990లో తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నక్సలైట్ రవన్నగా రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. 1992లో జరిగిన ఓ మరణం తనను తీవ్రంగా కదిలించింది.. ఓ సంక్షోభం తనను ఆలోచింపజేసిందని.. ఆ మరణం వెనక రాజకీయం ఉందని.. ఆ సంఘటనను ఎలాగైనా తెరపైకీ తీసుకురావాలనే బలమైన కాంక్ష ఎప్పటి నుంచో తకు ఉండేదని.. విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్రకు స్పూర్తి వరంగల్ కు చెందిన సరళ అనే మహిళ అంటూ ఇటీవల డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.