Ram Charan-Upasana: రాయల్ లుక్‌లో రామ్ చరణ్.. లవ్లీ డ్రస్‌లో ఉపాసన.. వైరల్ అవుతోన్న మెగా కపుల్ లేటెస్ట్ ఫొటోస్
శ్రీఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇటీవలే మెగాఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు చిరంజీవి. రామ్ చరణ్ దంపతులు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నారని గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు మెగాస్టార్. తనకు ఇష్టమైన దైవం శ్రీఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. దాంతో అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసనలకు అభిమానులు, సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14, 2012న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.వివాహం జరిగిన దశాబ్దం తర్వాత చిరంజీవి ఇంట్లో ఆనందం వెల్లివిరియబోతోంది.
తాజాగా రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనతో కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ బ్లాక్ డ్రస్ లో రాయల్ గా కనిపిస్తుండగా ఉపాసన కలర్ఫుల్ పూల డ్రస్ లో మెరిశారు. వీరితో పాటు తమ పెట్ కూడా ఫోటో షూట్ లో పాల్గొంది.




ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చరణ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




