Ram Charan: గ్లోబల్ స్టార్‌కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ విగ్రహావిష్కరణ.. వీడియో

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చెర్రీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Ram Charan: గ్లోబల్ స్టార్‌కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ విగ్రహావిష్కరణ.. వీడియో
Ram Charan

Updated on: May 10, 2025 | 9:25 PM

సినిమా రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలు, సాధించిన ఘనతలకు సూచికగా ఇప్పుడు అతనికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా ఈ వీడియోను చూసిన మెగాభిమానులు ఉప్పొంగిపోతున్నారు. వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం కోసం కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లాడు రామ్ చరణ్. అలాగే తన కోసం వచ్చిన అభిమానులను కూడా కలుస్తూ ఉన్నారు. ఇక శనివారం భార్య (ఉపాసన)తో కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లాడు రామ్ చరణ్. ఆ తర్వాత అశేష అభిమానుల సమక్షంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ మైనపు విగ్రహంలో చరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ రైమ్ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా తన మైనపు విగ్రహంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు రామ్ చరణ్. కాగా ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించనున్నారు.

కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాలను మాత్రమే మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ జాబితాలో చేరాడు. దీంతో మెగాభిమాను ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. రామ్ చరణ్ తో పాటు అతని పెట్ డాగ్ రైమ్ లకు సంబంధించిన కొలతలు, ఫొటోలు, వీడియోలను తీసుకుని ఎంతో అందంగా ఈ మైనపు బొమ్మను అందంగా తీర్చి దిద్దారు.

ఇవి కూడా చదవండి

తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తోన్న రామ్ చరణ్.. వీడియో..

అభిమానుల కేరింతల మధ్య…

తన మైనపు విగ్రహంతో రామ్ చరణ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .