
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఆభ్యర్థి వంగా గీతపై భారీ మెజారిటీతో గెలుపొందిన జనసేన అధినేతకు సినీ ప్రముఖులు, హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యుసర్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ గెలుపుతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో ఉంది. దాదాపు పదేళ్లుగా పవన్ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ఫలితం లభించిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, రేణూ దేశాయ్ స్పందిస్తూ విష్ చేశారు. తన సోదరుడు గెలుపుతో అన్నయ్యగా తనకు గర్వంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ గెలుపుపై రియాక్ట్ అయ్యారు.
“మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు. మా పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు. ఆయన విజయం తిరుగులేనిది” అంటూ రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం చరణ్ చేసిన నెట్టింట వైరలవుతుండగా మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు.
మరోవైపు పవర్ స్టార్ గెలుపుపై సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్ ఈరోజు ఉదయం నుంచి పవన్ వెంటే ఉన్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ గెలవడంతో సంతోషంతో తన మేనమామను హగ్ చేసుకుని సంతోషం వ్యక్తం చేశాడు సాయి దరణ్ తేజ్. ఇక అదే జోష్ లో పవన్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. “మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో, గురువు” అంటూ తన ప్రేమను మరోసారి చాటుకున్నారు.
A proud day for our family! Congratulations to my @PawanKalyan Garu on his phenomenal win!
— Ram Charan (@AlwaysRamCharan) June 4, 2024
మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని ❤️🔥😍 @pawankalyan garu my hero,my guru,my heart, most importantly MY SENANI 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/qD2oXYtONH
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.