
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పెద్ది మేనియా కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మెగా అభిమానులు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పెద్ది సినిమా ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ఉదయం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు థియేటర్ల వద్ద చరణ్, బుచ్చిబాబు కటౌట్స్ కు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చరణ్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. ? అవును.. తనకు నచ్చిన హీరో గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన చరణ్ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..
ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ (యూట్యూబ్ షార్ట్స్) ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఒక టాక్ షోలో భాగంగా హోస్ట్ రామ్‌చరణ్‌ను ఉద్దేశించి.. “మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు?” అని ప్రశ్నించారు. దానికి చరణ్ ఏమాత్రం తడుముకోకుండా, చాలా సింపుల్‌గా, చిరునవ్వుతో “ఐ లైక్ సూర్య” (నాకు సూర్య అంటే ఇష్టం) అని సమాధానమిచ్చారు. చరణ్ నోట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పేరు వినగానే అక్కడున్న హోస్ట్‌తో పాటు ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. తమిళ స్టార్ హీరో సూర్యకు కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉంది. ‘గజినీ’, ‘సింగం’, ‘ఆకాశం నీ హద్దురా’ వంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేసే సూర్య అంటే రామ్‌చరణ్‌కు కూడా ఎంతో గౌరవం, ఇష్టం ఉందని ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టమైంది.
ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ
ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్, సూర్య ఫ్యాన్స్ ఈ షార్ట్ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇద్దరు అగ్ర నటుల మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం చూసి నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ప్రస్తుతం సూర్య తన పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో భవిష్యత్తులో ఏదైనా మల్టీస్టారర్ సినిమా వస్తే చూడాలని ఉందంటూ ఇరు హీరోల అభిమానులు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..