‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’‌పై రామ్​చరణ్ ప్ర‌శంస‌లు

'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'‌పై రామ్​చరణ్ ప్ర‌శంస‌లు

విల‌క్ష‌ణ న‌టుడు సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'. కరోనా నేప‌థ్యంలో థియేటర్లు తెరిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.

Ram Naramaneni

|

Aug 11, 2020 | 9:50 AM

Uma Maheshwara Ugra Roopasya : విల‌క్ష‌ణ న‌టుడు సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’. కరోనా నేప‌థ్యంలో థియేటర్లు తెరిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. నెట్​ఫ్లిక్స్ వేదికగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ముఖ్యంగా స‌త్య‌దేవ్ న‌ట‌న‌కు సినిమా ప్ర‌ముఖులు కూడా ఫిదా అయ్యారు. మిగ‌తా ఆర్టిస్టులు కూడా పాత్ర‌ల‌కు ప్రాణ ప్ర‌తిష్ఠ చేశారు. తాజాగా ఈ సినిమాని చూసిన మెగాపవర్ స్టార్ రామ్​చరణ్ చిత్రబృందాన్ని ప్ర‌శంసించారు.

“‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ సినిమా నాకు చాలా బాగా న‌చ్చింది. సినిమా కంటెంట్ చాలా ఒరిజిన‌ల్‌గా ఉంది. న‌టీన‌టులు అంద‌రూ అద్భుతంగా వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వెంక‌టేశ్ మ‌హా ద‌ర్శ‌క‌త్వ విధానం బాగుంది. నిర్మాత‌ల‌కు శుభాకాంక్ష‌లు.” అంటూ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

మలయాళంలో విజయవంతమైన ‘మహిశ్ ఇంటే ప్రతీకారమ్‌’ చిత్రానికి రీమేక్​గా తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ తెర‌కెక్కింది. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ లాంటి విభిన్న చిత్రంతో డైరెక్ట‌ర్‌గా వెండితెరకు పరిచయమైన వెంకటేశ్‌ మహా ఈ సినిమాతో మరోసారి త‌న మార్క్ చాటుకున్నారు.

Also Read : చైతూ-సామ్ : సో క్యూట్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu