Shazahn Padamsee: ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన ఆరెంజ్ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్ షాజన్ పదంసీ. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ ఆరెంజ్ మూవీ రుబా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా పాపులర్ అయ్యింది ఈ హీరోయిన్. తాజాగా తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

Shazahn Padamsee: ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన ఆరెంజ్ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్..
Shazahn Padamsee

Updated on: Jan 25, 2025 | 7:39 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రాల్లో ఆరెంజ్ ఒకటి. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మ్యూజిక్ పరంగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హరీశ్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించారు. అప్పట్లో వీరిద్దరి కెమిస్ట్రీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 14న థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో రుబా పాటతో చాలా ఫేమస్ అయిన హీరోయిన్ గుర్తుందా.? ఈ సినిమాలో చరణ్ లవ్ స్టోరీలో కనిపిస్తుంది.

ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసి రూబాగా కనిపించింది. అలాగే వీరిద్దరి మధ్య వచ్చే సాంగ్ సైతం సూపర్ హిట్ అయ్యింది.ఈ బ్యూటీ పేరు షాజన్ పదంసి. సినిమాల్లోకి రాకముందు పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించిన ఈ అమ్మడు.. రాకెట్‌ సింగ్‌: సేల్స్‌మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కనిమొళి చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 వంటి సినిమాలు చేసింది. ఆరెంజ్ తర్వాత రామ్ పోతినేని సరసన మసాలా మూవీలో కనిపించింది. 2015లో సాలిడ్ పటేల్స్ సినిమా తర్వాత హిందీలో మరో సినిమా చేయలేదు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్ పన్ నెక్ట్స్ లెవల్ చిత్రంలో నటించింది.

తాజాగా ఈ అమ్మడు తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన నిశ్చితార్థం ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ప్రియుడు వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో రోకా జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఫోటోస్ షేర్ చేస్తూ.. జనవరి 20న కొత్త ప్రయాణం స్టార్ట్ అయ్యింది.. ‘#roka #engagement’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లోనూ అశీష్‌ తనకు ప్రపోజ్‌ చేసిన ఫోటోలు షేర్‌ చేసింది. వీరిద్దరి వివాహం త్వరలోనే జరగనుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..