దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో వాయిదా వేశారు మేకర్స్. దీంతో ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురయ్యింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ మరో ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేశారో తెలియదు కానీ.. సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్ట్ మెంబర్ అయిన ఉమైన్ సంధు ఆర్ఆర్ఆర్ సెన్సార్ రివ్యూను తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. “మైండ్ బ్లోయింగ్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ …. ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు .. ” అంటూ ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. దంగల్, బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని తెలిపారు. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్ , పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.
Censor Report of #RRR is MINDBLOWING ! #JrNTR Performance is talk of the town. ??
— Umair Sandhu (@UmairSandu) January 11, 2022
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హతో ఆసక్తికరమైన వీడియో..
Teaser Talk: అసలు మనిషి చర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హన్సిక కొత్త సినిమా టీజర్..
Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు
Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..