Ram Charan: సల్మాన్ ఖాన్.. వెంకటేష్‏తో డ్యాన్స్ పై రామ్ చరణ్ రియాక్షన్.. ‘ఏంటమ్మా’ సాంగ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్..

|

Apr 06, 2023 | 8:17 PM

సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌లతో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన డాన్స్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఊరమాస్ సాంగ్ లో లుంగీ కట్టి ముగ్గురూ వేసిన స్టెప్స్ ముగ్గరు హీరోల ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఈ సాంగ్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు.

Ram Charan: సల్మాన్ ఖాన్.. వెంకటేష్‏తో డ్యాన్స్ పై రామ్ చరణ్ రియాక్షన్.. ‘ఏంటమ్మా’ సాంగ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్..
Ram Charan
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్.. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన ఏంటమ్మ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అతిథి పాత్రలో తళుక్కున్న మెరిసిన సంగతి తెలిసిందే. సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌లతో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన డాన్స్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఊరమాస్ సాంగ్ లో లుంగీ కట్టి ముగ్గురూ వేసిన స్టెప్స్ ముగ్గరు హీరోల ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఈ సాంగ్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. జాతీయ స్థాయిలో తుఫానులా ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిన పాట గురించి చరణ్ మ‌న‌సులో మాట‌ను తెలియ‌జేశారు. ‘ఏంట‌మ్మా’ సాంగ్‌ను చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామ‌ని అన్నారు చరణ్.

ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోల‌తో క‌లిసి తాను ఏంటమ్మా సాంగ్‌లో న‌టించటం క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంద‌ని, మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెబుతూ , ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండ‌గ‌లా ఉంటుంద‌ని అన్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఈ పాట‌లో క‌నిపించ‌ని ఎన‌ర్జీతో చాలా పాపుల‌ర్ అయ్యింది. ఏంట‌మ్మా సాంగ్‌కు పాయ‌ల్ దేవ్ సంగీత అందించగా.. విశాల్ డ‌డ్లాని, పాయల్ దేవ్, ర‌ఫ్లార్ ఆల‌పించారు. ష‌బీర్ అహ్మ‌ద్ సాహిత్యాన్ని అందించగా జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రం ఈద్ సంద‌ర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది.

తమిళ్ సూపర్ స్టార్ అజిత్ నటించిన వీరం చిత్రానికి రీమేక్ ఇది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇందులో చరణ్ ఎంట్రీ స్పెషల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో తెలంగాణ నేపథ్యంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.