
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో అలరించారు. ఓవైపు పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న చరణ్..మరోవైపు తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అయితే ఈ శుభవార్తను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకోవడానికి ముందు.. చరణ్ మరొకరితో పంచుకున్నారట. ఇటీవల లాస్ ఏంజిల్స్ మీడియాతో మాట్లాడిన చెర్రీ.. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ముందుగా తన బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కు చెప్పానని అన్నారు. రామ్ చరణ్ తో ఆడుకోవడానికి తన పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని తారక్ అన్నారు. వీరిద్దరు ఆస్కార్ 2023కి ముందు అమెరికాలో జరిగి ఈవెంట్లలో పాల్గొనున్నారు.
“ప్రకటన చేయడానికి ముందు నా ఆనందాన్ని పంచుకోవడానికి మొదట తారక్‌కి ఫోన్ చేసాను. మేము నిజంగా సంతోషంగా ఉన్నాము, వ్యక్తిగతంగా , వృత్తిపరంగా మా జీవితంలో బాగానే ఉన్నాము. మేము మా జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించాము. ఇది ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. మరో వ్యక్తిని స్వాగతిస్తున్నందుకు మా అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చారు. ఆస్కార్ వేడుకల కంటే ముందు చరణ్.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డు ప్రధానోత్సవం వేడుకలలో పాల్గొననున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.