
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన సతీమణి ఉపాసతో పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు ఓ వివాహ వేడుక కోసం వెళ్లినట్లుగా ఇటీవల ఉపాసన ఇన్ స్టా స్టోరీ చూస్తే అర్థమయ్యింది. అయితే అక్కడ ఎవరి పెళ్లి అనేది తెలియరాలేదు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన కొణిదెల. “ప్రియమైన రోజ్మిన్.. నీకు శుభాకాంక్షలు.. పారిస్ లో మీతో మరింత సరదగా గడిపాము” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో చరణ్ కస్టమ్ మేడ్ లేత గోధుమ రంగు సూట్ ధరించి రాయల్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఉపాసన భారీ, క్లిష్టమైన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ చేసిన రిచ్ బ్రౌన్ అనార్కలి సూట్ ధరించారు. ఈ అనార్కలి సూట్ ఆమె గ్రేస్, స్టైల్ పెంచడమే కాకుండా మరింత అందంగా కనిపిస్తున్నారు.
ఇటీవలే ఈ దంపతులకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వచ్చిన మెగా ప్రిన్సెస్కు క్లింకారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు పాపకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన చరణ్, ఉపాసన.. పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరు కలిసి నటిస్తోన్న రెండో సినిమా కావడం విశేషం. అలాగే ఇందులో శ్రీకాంత్, హీరోయిన్ అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక చరణ్ పారిస్ నుంచి రాగానే గేమ్ ఛేంజర్ సినిమా చివరి దశ షూటింగ్ లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.