Ram Charan-Upasana: వరల్డ్ టాప్ మ్యాగజైన్ కవర్ ఫోటోపై రామ్ చరణ్-ఉపాసన.. స్పెషల్ అట్రాక్షన్‏గా..

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా చరణ్ దంపతులు ముంబైలో ఉంటున్నారు. తమ కూతురు క్లింకారతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాజాగా నిన్న శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‏నాథ్ షిండే ఇంటికి అతిథిగా వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వారికి పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. అంతేకాకుండా వారికి వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Ram Charan-Upasana: వరల్డ్ టాప్ మ్యాగజైన్ కవర్ ఫోటోపై రామ్ చరణ్-ఉపాసన.. స్పెషల్ అట్రాక్షన్‏గా..
Ram Charan, Upasana

Updated on: Dec 23, 2023 | 12:46 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ రేంజ్ అమాంతం పెంచేసుకున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు విమర్శకులు.. హాలీవుడ్ మేకర్స్ ముగ్దులయ్యారు. దీంతో ఇప్పుడు ఆయన పేరు వరల్డ్ వైడ్‏గా వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా చరణ్ దంపతులు ముంబైలో ఉంటున్నారు. తమ కూతురు క్లింకారతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాజాగా నిన్న శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‏నాథ్ షిండే ఇంటికి అతిథిగా వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వారికి పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. అంతేకాకుండా వారికి వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అయితే ఇప్పుడు చరణ్, ఉపాసన దంపతులు వరల్డ్ టాప్ మ్యాగజైన్ పై కనిపించారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా.. చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజీపై ఇలా రాసుకొచ్చారు. “సూపర్ కపుల్. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్. ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.