Ram Charan: మరోసారి మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్.. ఉక్రెయిన్ లోని తన సెక్యూరిటీ గార్డుకి మనీ పంపిన చెర్రీ..

Ram Charan: రష్యా(Russia) ఉక్రెయిన్( Ukraine) పై దాడి చేయడానికి ముందు అందమైన దేశం. ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు,  సుందరమైన భవన  నిర్మాణాలు , అందమైన ప్రకృతి ప్రదేశాలకు నిలయం.. దీంతో యుద్ధానికి..

Ram Charan: మరోసారి మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్.. ఉక్రెయిన్ లోని తన సెక్యూరిటీ గార్డుకి మనీ పంపిన చెర్రీ..
Ram Charan Helps Ukraine Se

Updated on: Mar 16, 2022 | 4:35 PM

Ram Charan: రష్యా(Russia) ఉక్రెయిన్( Ukraine) పై దాడి చేయడానికి ముందు అందమైన దేశం. ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు,  సుందరమైన భవన  నిర్మాణాలు , అందమైన ప్రకృతి ప్రదేశాలకు నిలయం.. దీంతో యుద్ధానికి ముందు నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండేది. అంతేకాదు ఉక్రెయిన్ లో పలు తెలుగు సినిమాలు కూడా షూటింగ్ ను జరుపుకున్నాయి.  2017 లో టాలీవుడ్ విన్నర్((Winner) సినిమా షూటింగ్ అక్కడే జరుపుకుంది. అంతేకాదు అక్కడ షూటింగ్ కోసం వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ చిత్ర‌మిదే.  అనంతరం రజనీకాంత్ రోబో 2 వంటి అనేక సినిమాలు ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. తాజాగా రిలీజ్ సిద్ధమవుతున్న మెగా మల్టీస్టారర్ మూవీ “ఆర్ఆర్ఆర్”(RRR Movies) కూడా గత ఏడాది ఆగష్టులో ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. “రౌద్రం రణం రుధిరం” లోని ఫేమస్ సాంగ్  ‘నాటు నాటు…’ (naatu naatu song) సాంగ్  షూటింగ్ ఉక్రెయిన్ లోనే  జరుపుకుంది. ఆ సాంగ్ లోని బ్యాక్‌గ్యౌండ్ డ్యాన్స‌ర్లు ఉక్రెయిన్ వాసులే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ‘నాటు నాటు’ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీక‌రించారు. అయితే “ఆర్ఆర్ఆర్: షూటింగ్  జరుపుకున్నప్పుడు అక్కడ పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. రష్యా సేనల బాంబు దాడుల్లో ఒకవైపు ఉక్రెయిన్ సైనిక స్థావరాలు కుప్పకూలుతుండగా.. మరోవైపు అమాయక ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అయితే ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్కడ పరిస్థితులపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేశానని చెప్పాడు. తాను ఉక్రెయిన్ లో యుద్ధం మొదలైన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైమ్‌లో… అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో మాట్లాడాను. ఆయన తండ్రి, 80 ఏళ్ళ వ్యక్తి గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీకి నేను కొంత డబ్బులు పంపించాను. అయితే తాను చేసిన ఆ సహాయం సరిపోదని అన్నారు.. కానీ నేను నా వంతు సహాయం చేశా” అని రామ్ చరణ్ (ram charan) చెప్పారు.

ఉక్రెయిన్ ప్రజలు చాలా ఫ్రెండ్లీ. ప్రొఫెషనల్ అని ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాదు సాలు నాటు నాటు సాంగ్‌లో డ్యాన్స్ స్టైల్ వాళ్ళ డ్యాన్స్ స్టైల్ కాదు.. కానీ వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకున్నారు అంటూ వారితో ఏర్పడిన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, తాను, తమ టీమ్‌లో ఇతర సభ్యులు ఉక్రెయిన్‌లో తమకు తెలిసిన వాళ్ళతో మాట్లాడామని రాజమౌళి వివరించారు.

Also Read:

మహమ్మారితో పోరాడేందుకు మెరుగైన స్థితిలో ఉన్నాం.. ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌లు అందరు తీసుకోవాలిః ప్రధాని మోడీ

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్, శరన్‌ల వివాదానికి ఎండ్ కార్డు.. అకౌంట్స్ సెటిల్ చేసుకున్నామన్న శరన్

Armed Forces Flag Day: అమరజవాన్ల ఫ్యామిలీలకు అండగా ఎస్బిఐ.. గవర్నర్ తమిళసై కు భారీ విరాళం అందజేత