Rakshit Shetty : కుక్క పిల్లతో కలిసి కామెడీ చేయడానికి రెడీ అవుతున్న కన్నడ హీరో.. 777 ఛార్లిగా రానున్న సినిమా..
కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్నిసంపాదించుకున్నాడు రక్షిత్ శెట్టి.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి(Rakshit Shetty )తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్నిసంపాదించుకున్నాడు రక్షిత్ శెట్టి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నాడు రక్షిత్. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ రిలీజ్ అవ్వనుంది.
ఈ సినిమాలో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుదర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇబ్బందలు పడినప్పుడు ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది. చివరకు ఏం జరిగిందనే విషయాలను 777 ఛార్లి అనే అడ్వెంచరస్ కామెడీలో చూపించబోతున్నారు.