Raju Weds Rambai: మరో సాయిపల్లవి అంటున్నారు.. మొదటి సినిమాతోనే మనసు దోచిన ‘రాంబాయి’? ఇంతకీ ఎవరీ అందాల తార?

శుక్రవారం (నవంబర్ 21) రిలీజైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలో హీరోయిన్ యాక్టింగ్ అద్దిరిపోయిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. చాలా సీన్స్ లో సాయి పల్లవిని గుర్తు చేసిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Raju Weds Rambai: మరో సాయిపల్లవి అంటున్నారు.. మొదటి సినిమాతోనే మనసు దోచిన రాంబాయి? ఇంతకీ ఎవరీ అందాల తార?
Raju Weds Rambai Movie Heroine

Updated on: Nov 21, 2025 | 8:38 PM

ఈ శుక్రవారం (నవంబర్ 21) థియేటర్లలోకి అరజనుపైగా సినిమాలు వచ్చాయి. అయితే అన్నిటికంటే రాజు వెడ్స్ రాంబాయి సినిమానే అందరి దృష్టిని ఆకర్షించింది. రిలీజ్ కు ముందు నుంచే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం రిలీజైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సూపర్ హిట్ వచ్చింది. ముఖ్యంగా యూత్‌ ని ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటోంది. హీరోహీరోయిన్లు ఇద్దరు కత్త వారైనా చాలా బాగా యాక్ట్ చేశారంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాంబాయి పాత్రలో హీరోయిన్‌ తేజస్వీ రావు యాక్టింగ్‌ చాలా సహాజంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా న్యాచురల్ గా ఉందని ఆడియెన్స్ కొనియాడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో సాయి పల్లవి దొరికేసిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఎవరీ రాంబాయి? ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న విషయాలపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తేజస్వీ రావు గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా సినిమాల్లో సినిమాల కంటే ముందు తేజస్వీ రావు పలు షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించింది. సయోని, బావమరదలు 1-2, పెళ్లి కూతురు విత్‌ మేనీ డౌట్స్‌, మినిట్స్, నిశ్చితార్థం, కేరళ కుట్టి, లవ్‌ స్టోరీ ఇన్‌ రాజమండ్రీ, మాస్‌ గాడి క్లాస్‌ పిల్ల వంటి తదితర షార్ట్స్‌ ఫిల్మ్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే కమిటీ కుర్రాళ్లు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇదే ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమాలో జ్యోతి పాత్ర చేసింది ఈమెనే. ముద్దు పెట్టుకుంటే కడుపు వచ్చేస్తాది అని ఏడిచే అమ్మాయిగా అందరి దృష్టిని ఆకర్షించింది తేజస్వి. అయితే ఈ మూవీలో చాలా మంది నటీనటులు ఉండడంతో తేజస్వికి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇన్ స్టా గ్రామ్ లో తేజస్వీ రావు..

అయితే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిలో మెయిన్ హీరోయిన్ గా చేసింది తేజస్వీ రావు. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టినప్పటికీ తెలంగాణ యాసలో ఈ అమ్మాయి అద్బుతంగా నటించిందిని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సినిమాలో ఈమె ఇచ్చిన చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆడియెన్స్‌ ఫిదా అవుతున్నారు. సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.