
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా కూలి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.
భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రజినీ కెరీర్ లో 171వ సినిమాగ వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదోక న్యూస్ వైరలవుతుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయళం భాషలలోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీ గా పెంచేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.