Mahesh Babu: మహేష్ సినిమా కోసం జక్కన్న రెండు కథలను రెడీ చేశాడట..!

|

May 23, 2022 | 4:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తాజాగా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

Mahesh Babu: మహేష్ సినిమా కోసం జక్కన్న రెండు కథలను రెడీ చేశాడట..!
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తాజాగా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మహేష్ సూపర్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమా వసూళ్ల పరంగాను దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ నటించే నెక్స్ట్ సినిమా గురించి హాట్ డిస్కషన్ నడుస్తుంది ఫిలిం సర్కిల్స్ లో మహేష్ తన నెక్స్ట్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఆతర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి నిత్యం ఫిలింసర్కిల్స్ లో ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

తాజాగా మహేష్ , రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. మహేష్ కోసం రారాజు రెండు కథలను సిద్ధం చేశారట. జక్కన్న రెండు స్క్రిప్ట్ లను రెడీ చేసి మహేష్ బాబు తో చివరి దశ చర్చల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే మహేష్ తన ఫ్యామిలీతో వెకేషన్ కు విదేశాలు వెళ్లారు.ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఈ రెండు కథలను మహేష్ కు వినిపించనున్నారట.. మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే రాజమౌళి టీమ్ మహేష్ బాబు సినిమా కోసం లొకేషన్ల వేట కూడా మొదలు పెట్టారట. మహేష్ కథను లాక్ చేయగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారట జక్కన్న. అలాగే మహేష్ త్రివిక్రమ్ సినిమా వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..