
Aha: తెలుగు వారికి వినోదాన్ని పంచుతూ.. 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో దూసుకుపోతున్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి ఆహా లిస్టులో మరో మాస్ ఎంటర్‌టైనర్ చేరింది. అదే రాజ్ తరుణ్, కాషిష్ ఖాన్ జంటగా నటించిన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్ ‘అనుభవించు రాజా’. ఈ చిత్రం ఆహా ప్రీమియర్‌గా డిసెంబర్ 17న ప్రసారం కానుంది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. రాజ్‌తరుణ్, కషిష్ ఖాన్‌తో పాటు సుదర్శన్, ఆడుగలం నరేన్, అజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్రామంలో ఉండేటువంటి రాజకీయాలు, యాక్షన్, హాస్యం వంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.
భీమవరంలో ఉం డే బంగార్రాజు అలియాస్ బంగారం అనే యువకుడి చుట్టూ తిరిగే కథే అనుభవించు రాజా. బంగార్రాజు ఓ ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోతాడు. తాతయ్య దగ్గర పెరుగుతాడు. ఆయన చనిపోతూ జీవితాన్ని సరదాగా గడపాలని చెబుతాడు. ఉన్న డబ్బునంతా జల్సాల కోసం వాడేస్తుంటాడు. అయితే తన మనసు చాలా మంచిది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో బంగార్రాజు జైలు కెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో పట్నంకు వెళ్లి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అవుతాడు. అదే కంపెనీలో పని చేసే శ్రుతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెకు తన గతాన్ని తెలియకుండా బంగార్రాజు జాగ్రత్త పడుతుంటాడు. అసలేం జరిగింది? చివరకు బంగార్రాజు జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనేదే కథ.
రాజ్ తరుణ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్నాడు. సిటీల్లోని వేగవంతమైన జీవితాన్ని ఇందులో ఆవిష్కరించారు. మరో వైపు పల్లెల్లో ఉండే అమాయకత్వం, అందాలను కూడా చక్కగా చూపించారు. కషిష్ ఖాన్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. సుదర్శన్, ఆడుగలం నరరేశ్, అజయ్ తదితరులు సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక 2021లో ..లవ్‌స్టోరి, అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే, త్రీ రోజెస్, వన్, మంచిరోజులు వచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, సర్కార్, చెఫ్ మంత్ర, ది బేకర్ అండ్ ది బ్యూటీ, క్రాక్, అల్లుడు గారు, 11 అవర్, జాంబిరెడ్డి, చావు కబురు చల్లగా, నాంది, సూపర్ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేష, పరిణయం, ఇచట వాహనములు నిలుపరాదు వంటి తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలు, ఒరిజనల్, ప్రోగ్రామ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది ఆహా.
మరిన్ని ఇక్కడ చదవండి :