Jigarthanda Double X OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుదంటే..

|

Dec 08, 2023 | 2:36 PM

ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన 'జిగర్ తండ డబుల్ ఎక్స్' సినిమాతో మాత్రం సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు లారెన్స్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో లారెన్స్, ఎస్జే సూర్య కలిసి నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన మొదటి పార్ట్ కు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు కార్తీక్. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ ఈ సినిమాకు అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Jigarthanda Double X OTT: ఓటీటీలోకి వచ్చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుదంటే..
Jigarthanda 2 Movie OTT
Follow us on

చాలా కాలం తర్వాత చంద్రముఖి 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు రాఘవ లారెన్స్. గతంలో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఆ తర్వాత ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమాతో మాత్రం సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు లారెన్స్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో లారెన్స్, ఎస్జే సూర్య కలిసి నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన మొదటి పార్ట్ కు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు కార్తీక్. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ ఈ సినిమాకు అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ.

ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా భాషల్లో ఈ రోజు నుంచి జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు థియేటర్లలో ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిన వారు.. ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీ చూడొచ్చు. ఈ సినిమాలో సూర్య, నిమిషా సజయన్, సంజన నటరాజన్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఎస్జే సూర్య పాత్రకు..నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న లారెన్స్ కు ఈ మూవీకి మంచి రీఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి.

అయితే జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా పాన్ ఇండియా భాషలలోనే కాకుండా ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.