Rag Mayur: ఈ కుర్రాడు టాకాఫ్ ది ఇండస్ట్రీ ఇప్పుడు.. ఎవరీ రాగ్ మయూర్..?
సినిమా ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కోసారి ఒక్క రోజులోనే జాతకాలు మారిపోతుంటాయి. అలా ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాగ్ మయూర్. ఇంతకీ టాకాఫ్ ది ఇండస్ట్రీగా మారిన రాగ్ ఎవరు అనుకుంటున్నారు కదా..? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే..

ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కోసారి ఒక్క రోజులోనే జాతకాలు మారిపోతుంటాయి. అలా ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాగ్ మయూర్ (Rag Mayur). ఇంతకీ ఎవరీయన అనుకుంటున్నారు కదా..? కొందరు పేర్ల కంటే కూడా క్యారెక్టర్స్‌తోనే ఎక్కువగా గుర్తుంటారు. రెండేళ్ళ కింద తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో హీరో పక్కనే ఉండే ఓ పాత్ర ఉంటుంది కదా.. అతడే రాగ్ మయూర్. తెలంగాణ యాసలో అదిరిపోయే నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. దానికంటే ముందే కోవిడ్ టైమ్‌లో సినిమా బండిలో తన పర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు వేయించుకున్నాడు రాగ్.
ఇప్పుడు సివరపల్లి వెబ్ సిరీస్‌తో బాగా రిజిష్టర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఒకేరోజు హీరోగా, విలన్‌గా మారి.. మెప్పించాడు రాగ్ మయూర్. అదెలా అంటే.. సుకుమార్ కూతురు సుకృతా బండ్రెడ్డి నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడీయన. ఇటు సివరపల్లి, అటు గాంధీతాత చెట్టు ఒకేరోజు విడుదల కావడం గమనార్హం. ఈ రెండింటిలోనూ రాగ్ మయూర్ విభిన్న పాత్రలలో కనిపించాడు. దాంతో ఈ కుర్రాడి గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందిప్పుడు. ముఖ్యంగా సివరపల్లి వెబ్ సిరీస్ గురించి ప్రస్థావిచించినపుడు అందులో రాగ్ మయూర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అంత న్యాచురల్‌గా ఆ పాత్రలో నటించాడు రాగ్.
పంచాయత్ రీమేక్ అయినా కూడా.. తెలుగులో తెలంగాణ యాసతో అద్భుతంగా నటించాడీయన. ఆ మధ్య వీరాంజనేయులు విహారయాత్ర అనే ఒరిజినల్ సినిమా కూడా ఒకటి చేసాడు రాగ్. మొత్తానికి రొటీన్ కాకుండా.. కాస్త విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్నాడు రాగ్ మయూర్. ఇప్పటికే గీత ఆర్ట్స్ 2లో ఓ సినిమాతో పాటు.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న పరదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న గరివిడి లక్ష్మిలో కీలక పాత్రలు చేస్తున్నాడు రాగ్ మయూర్. మొత్తానికి అటు సినిమాలు, ఇటు డిజిటల్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం కోసం చూస్తున్నాడు రాగ్. మనోడి దూకుడు చూస్తుంటే త్వరలోనే అది వచ్చేలా కనిపిస్తుంది కూడా..!
రాగ్ మయూర్ లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram