Radhika Sarathkumar: ఆ విషయం చెప్పగానే మోహన్ లాల్ కాల్ చేశారు.. రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

|

Sep 04, 2024 | 4:10 PM

ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు హీరోయిన్స్ కారవాన్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోస్ చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశం గురించి మాట్లాడగానే తనకు నటుడు మోహన్ లాల్ ఫోన్ చేసినట్లు తాజాగా వెల్లడించారు.

Radhika Sarathkumar: ఆ విషయం చెప్పగానే మోహన్ లాల్ కాల్ చేశారు.. రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..
Radhika, Mohanlal
Follow us on

మలయాళీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండస్ట్రీలో మహిళలు ఎన్నో ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదికలో బయటపడడంతో.. మరికొందరు నటీమణులు తమకు ఎదురైన పరిస్థితులను ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. దీంతో ఇప్పటికే కేరళ చలనచిత్ర పరిశ్రమలో మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ భాషలలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే పలువురు నటీమణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు హీరోయిన్స్ కారవాన్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోస్ చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశం గురించి మాట్లాడగానే తనకు నటుడు మోహన్ లాల్ ఫోన్ చేసినట్లు తాజాగా వెల్లడించారు.

“మోహన్ లాల్ ఉన్న సెట్ లో అలాంటి సంఘటన జరిగిందా అని మోహన్ లాల్ ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంఘటన జరిగినప్పుడు సెట్ లో ప్రధాన నటీనటులు ఎవరూ లేరని చెప్పాను. ఇందుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సెట్ లో రహస్య కెమెరాలు గురించి తెలుసుకున్న తర్వాత నేను గట్టిగా అరిచానని.. ఆ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరాను. ఈ విషయాలన్నింటిని మోహన్ లాల్ కు చెప్పాను” అంటూ అన్నారు రాధిక శరత్ కుమార్.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో నటీమణులే కాకుండా పలువురు హీరోలు కూడా ఈ సంఘటనపై స్పందించారు. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్, నటుడు విశాల్ వంటి స్టార్స్ స్పందిస్తూ.. మహిళలను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఇండస్ట్రీలోని పెద్దలు కూడా మాట్లాడాలని రాధిక కోరారు. అలాగే బాధిత మహిళల తరపున మాట్లాడాలని తన భర్తను కోరినట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.