AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాగా నటించాలనుకున్నాను.. ఆయనను చూస్తేనే వణికిపోయాను! నిజాయితీగా చెప్పేసిన అందాల భామ

టాలీవుడ్‌లో తన క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో 'ఊహలు గుసగుసలాడే' అంటూ కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్ ఆమె. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ ..

బాగా నటించాలనుకున్నాను.. ఆయనను చూస్తేనే వణికిపోయాను! నిజాయితీగా చెప్పేసిన అందాల భామ
Beauty Queen.
Nikhil
|

Updated on: Dec 22, 2025 | 7:00 AM

Share

టాలీవుడ్‌లో తన క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్ ఆమె. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు పంచుకుంది. ఒకానొక దశలో షూటింగ్ సెట్‌కు వెళ్లాలంటేనే వణికిపోయానని, ఒక స్టార్ హీరో ముందు నటించడానికి చాలా భయపడ్డానని నిజాయితీగా ఒప్పేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?

మొదటి సినిమా షూటింగ్​లోనే స్టార్​ హీరోను చూసి భయపడిపోయానంటూ కామెంట్స్​ చేసిన బ్యూటీ ఎవరో కాదు టాలీవుడ్​ అందాల భామ రాశీ ఖన్నా! తన మొదటి మలయాళ సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మలయాళం అస్సలు సులభమైన భాష కాదు. నా మొదటి మలయాళ సినిమా సమయంలో నేను చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యాను. దానికి తోడు ఆ సినిమాలో లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ గారు ఉన్నారు. ఆయన సెట్‌లోకి వచ్చారంటే చాలు.. నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, ఎక్కడ తప్పు చేస్తానో అని కంగారు పడేదాన్ని” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

Mohanlal And Pawan Kalyan

Mohanlal And Pawan Kalyan

ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఛాన్స్

ప్రస్తుతం రాశీ ఖన్నా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో రాశీ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తోంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Raashi Khanna

Raashi Khanna

రాశీ నటించిన ‘తెలుసు కదా’ సినిమా ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందన పొందినప్పటికీ, మెగా సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. వెండితెరపై పవన్ కళ్యాణ్ పక్కన రాశీ ఖన్నా గ్లామర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!