
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది రాశీఖన్నా. ఆ తర్వాత ‘జిల్’, ‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘రాజా ది గ్రేట్’, ‘తొలిప్రేమ’, ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ తదితర హిట్ సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ హీరోయిన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా మంగళవారం(నవంబర్30)న రాశీ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరో స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
కాగా మారుతీ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ఏంజెల్ ఆర్ణా పాత్రలో రాశీ చేసిన అల్లరి అంతా ఇంతాకాదు. ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో నిజంగానే భువి నుంచి దిగివచ్చిన ఏంజెల్(దేవకన్యలా) దర్శనమిచ్చిందీ అందాల తార. తన బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్ టీజర్ ఆకట్టుకుంటోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త భాగస్వామ్యంతో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’, కార్తీతో కలిసి ‘సర్దార్’ సినిమాల్లో నటిస్తోందీ అందాల తార.
AP Online Ticketing: పెద్ద సినిమాలు ఇక్కడ… బడా ప్రొడ్యూసర్ల కష్టాలు తీర్చే ‘పెద్దన్న’ ఎక్కడ?
Samantha: సమంత హాలీవుడ్ చిత్రానికి ఆ హీరోనే కారణమా.? నెట్టింట వైరల్ అవుతోన్న వార్త..
MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?