Raadhika Sarathkumar: ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో అతడే నా ఫేవరేట్.. నేను, మా ఆయన ఇద్దరం అతడికి పిచ్చి ఫ్యాన్స్.. రాధిక శరత్ కుమార్..
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు హీరోయిన్లలో ఆమె ఒకరు. విభిన్న కంటెంట్ పాత్రలు ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది రాధిక శరత్ కుమార్. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే తాయ్ కిళవి సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. తాజాగా తన ఫేవరేట్ హీరో గురించి చెప్పకొచ్చింది.

సుదీర్ఘకాలంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తాయ్ కిళవి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతానికి తల్లి పాత్రలు చేయనని, ముఖ్యంగా చిరంజీవికి తల్లి పాత్రలు చేయమని అడిగితే కాళ్లు విరిగ్గొట్టేస్తానని నవ్వుతూ చెప్పారు. తన వయస్సున్న నటుల కోసం యువ దర్శకులు వైవిధ్యమైన, సృజనాత్మక పాత్రలను సృష్టిస్తున్నారని అన్నారు. గతంలో తమకు కేవలం “పాథెటిక్ మదర్” పాత్రలే వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంలో అలాంటి పాత్ర పోషించానని గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..
తెలుగు హీరోల గురించి చెబుతూ.. జూ. ఎన్టీఆర్ అద్భుతమైన ఎనర్జీ తనకెంతో ఇష్టమని, తన మనవడికి కూడా తారక్ అనే పేరు పెట్టానని వెల్లడించారు. బాల్యం నుంచి చూసిన అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల ఎదుగుదల చూసి ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. మహేశ్ బాబును బాల్యంలో కృష్ణ షూటింగ్‌లో ఒక అమాయక, చాక్లెట్ బాయ్‌గా చూశానని, ఇప్పుడు ఆయన సాధించిన విజయం అద్భుతమని అన్నారు. తమిళంలో మాత్రం అజిత్, విజయ్ తప్ప యువతరం హీరోలు తక్కువగా ఉన్నారని, తెలుగులో ఉన్నంత వైవిధ్యం అక్కడ లేదని పోల్చారు. పాన్ ఇండియా సినిమాల విజయంపై రాధిక సంతోషం వ్యక్తం చేశారు. గతంలో భాషా పరిమితులు ఉండేవని, ఇప్పుడు ప్రేక్షకులకు విస్తృతమైన ఆలోచన వచ్చి, ప్రతిభను అంగీకరిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ (సీనియర్)తో తాను వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే ఒక్క సినిమా మాత్రమే చేశానని, అది ఆయన చివరి చిత్రం అని గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
ఎన్టీఆర్ (సీనియర్), అక్కినేని నాగేశ్వరరావుల క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ, వారిద్దరినీ చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ క్రమశిక్షణకు నంబర్ వన్ అని, ఉదయం 6 గంటల షూటింగ్ అంటే 5:45 గంటలకే మేకప్‌తో సిద్ధంగా ఉండేవారని తెలిపారు. నాగేశ్వరరావు పాటల చిత్రీకరణకు ముందు భోజనం చేయకుండా, తేలికగా ఉండేందుకు బిస్కెట్లు, టీ మాత్రమే తీసుకునేవారని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

Radhika Sarathkumar, Ntr
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
