Raithanna: రైతు చట్టాలను రద్దు చేయాలనే సినిమా తీశానంటోన్న నారాయణ మూర్తి.. థియేటర్లలో రైతన్న వచ్చేదెప్పుడంటే.

Raithanna Movie: సమాజంలో ప్రజలు ఎదుర్కొనే కష్టాలనే సినిమా కథాంశంగా తెరకెక్కించే వారిలో మొదటి వరుసలో ఉంటారు దర్శకులు ఆర్‌. నారాయణ మూర్తి. కమర్షియల్‌ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా...

Raithanna: రైతు చట్టాలను రద్దు చేయాలనే సినిమా తీశానంటోన్న నారాయణ మూర్తి.. థియేటర్లలో రైతన్న వచ్చేదెప్పుడంటే.
Raithanna Movie Releasing D

Updated on: Aug 11, 2021 | 4:30 PM

Raithanna Movie: సమాజంలో ప్రజలు ఎదుర్కొనే కష్టాలనే సినిమా కథాంశంగా తెరకెక్కించే వారిలో మొదటి వరుసలో ఉంటారు దర్శకులు ఆర్‌. నారాయణ మూర్తి. కమర్షియల్‌ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ప్రజల కష్టాలనే ఇతివృత్తంగా సినిమాలు తెరకెక్కిస్తుంటారు మూర్తి. ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈసారి రైతన్నల నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలనే ఇతివృత్తంగా ‘రైతన్న’ అనే సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న ‘రైతన్న’ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి నారాయణ మూర్తి సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో పలు అంశాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రైతన్న సినిమాను తీశానని చెప్పిన మూర్తి.. దేశానికి వెన్నెముక అయిన రైతు స్థానం ఇప్పుడు ఎక్కడుందని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని, అన్నం పెట్టే అన్నదాతకి గిట్టుబాటు ధర కావాలని, కేంద్రప్రభుత్వం డా.స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులని అమలు చేయాలనే డిమాండ్‌ని ఈ సినిమాలో బలంగా ప్రస్తావిస్తున్నామని తెలిపారు. ఈ భూమ్మీద వస్తువు తయారు చేసిన ప్రతీ ఒక్కరు ఆ వస్తువు ధరను వారే నిర్ణయిస్తారు, కానీ ఒక్క రైతుకు మాత్రమే ఆ అవకాశం లేదన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కచ్చితంగా రావాలి, ఇందుకోసం రైతులు చేస్తోన్న పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని మూర్తి చెప్పారు. అందరిలోనూ రైతులపై ఆలోచన రేకెత్తంచే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నామని చెప్పుకొచ్చిన మూర్తి.. అందరూ సినిమాను చూడాలని కోరారు.

Also Read: ప్లాన్ అదుర్స్.. మురుగు నుంచి మంచి నీరుగా మార్చే ప్రయోగం.. నీటి కష్టాలకు చెక్..

Hockey Player Rajini: ఒలింపిక్‌ హాకీ ప్లేయర్‌ రజినీపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్‌.. రూ. 25 లక్షలు, ఉద్యోగంతో పాటు..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు.. ఆ జిల్లాలో కలవరపెడుతున్న మరణాలు