లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ కు గురువారం (అక్టోబర్ 24) కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం (అక్టోబర్ 25)న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చారు పుష్ప 2 నిర్మాతలు. కాగా ఈ ఘటన జరగక ముందే పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని తీసుకున్నారు. అయితే అనూహ్యంగా జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో పుష్ప 2లో ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గురువారం పుష్ప 2 నేషనల్ ప్రెస్ మీట్ జరిగింది. అదే సమయంలో జానీ మాస్టర్ కి కూడా బెయిల్ మంజూరు కావడంతో రిపోర్టర్లు ఈ అంశంపై పుష్ఫ 2 నిర్మాతలను ప్రశ్నించారు. జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో పుష్ప 2లో సాంగ్ ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారా అని మీడియా అడిగింది. దీనికి నిర్మాత సమాధానమిస్తూ.. ‘ మేం ఆల్రెడీ కొరియోగ్రాఫర్ ను మార్చేశాం. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాం. నవంబర్ 4 నుంచి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. అంటే పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం జానీ మాస్టర్ కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు.
కాగా గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక అమ్మాయి జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పాడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ మీద పోక్సో కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన 35 రోజుల తర్వాత జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది.
Tollywood Choreographer Jani Master Granted Bail in POCSO Case
The Telangana High Court has granted bail to Tollywood choreographer Sheikh Janibasha, also known as Jani Master, who was arrested on charges under the Protection of Children from Sexual Offences (POCSO) Act. Jani… pic.twitter.com/zDIjOzG83Y
— Sudhakar Udumula (@sudhakarudumula) October 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..