ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా కథ కూడా పూర్తిగా మనీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే టైటిల్ కూడా కుబేరా అనే పెట్టారు మేకర్స్. నిజానికి రెండు మూడేళ్లుగా తెలుగులో మనీ బేస్డ్ కథలకు డిమాండ్ పెరిగింది. మారుతి పక్కా కమర్షియల్, అనిల్ రావిపూడి ఎఫ్ 3 కథలు కూడా పూర్తిగా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి.