Pushpa 2: ఇది సార్ పుష్ప రాజ్ రేంజ్..! రిలీజ్‌కు ముందే వెయ్యికోట్లకు పైగా బిజినెస్

|

Oct 24, 2024 | 4:17 PM

పుష్ప: ది రైజ్ సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈసారి, పుష్ప 2: ది రూల్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2: ఇది సార్ పుష్ప రాజ్ రేంజ్..! రిలీజ్‌కు ముందే వెయ్యికోట్లకు పైగా బిజినెస్
Pushpa 2
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఊర మాస్ అవతార్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  విడుదలకు ముందే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నయా రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభించింది పుష్ప 2. ఇప్పటివరకు మొత్తంగా రూ.1085 కోట్ల ప్రీ-రిలీజ్ కలెక్షన్‌ను సాధించింది.

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాను డిసెంబర్ 6న సినిమా విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆ డేట్ మారింది ఒక్కరోజు ముందుగానే సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. పుష్ప 2 ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. నవంబర్‌ నాటికి సినిమా షూటింగ్‌ పూర్తి చేసి.. ఆ తర్వాతే ట్రైలర్‌విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక పాట షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది అని టాక్ వినిపిస్తుంది.. కాగా సౌత్ లోనే కాదు నార్త్ ప్రేక్షకుల్లోనూ పుష్పరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది.

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. పార్ట్ 1 వన్ కంటే పార్ట్ 2లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే పుష్ప 2లో ఊహించని ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయట. అలాగే రష్మిక పాత్ర కూడా పార్ట్ 2లో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. విడుదలకు ముందే రూ.1085 కోట్ల బిజినస్ చేసిన పుష్ప 2 రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.