దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ గంధర గుడి ‘ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. , ‘ అప్పు’ నటించిన లాస్ట్ మూవీ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి అక్టోబర్ 28న స్క్రీన్‌లపై సందడిచేస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శక్తివంతమైన సందేశం, అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ‘గంధర గుడి’ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆకట్టుకుంది. కన్నడ డాక్యుడ్రామాలో అప్పు సహజంగా నటించాడు. సినీ పరిశ్రమ గ్లామర్ కు దూరంగా ఉన్న ఈ సినిమా పునీత్ రాజ్‌కుమార్ అభిమానులను ఆకట్టుకుంది. కర్ణాటక సహజ వైభవాన్ని దగ్గరగా చూసేలా చేసింది. ఈ సినిమాపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కర్ణాటక అడవులను, వాటిలోని ప్రాముఖ్యతను కన్నడిగులకు తెలియాలజేయాలనే ఉద్ధేశంతో పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమా చేసినట్లు తెలుస్తోంది.
బెయ్యడ హూవు, వసంతగీత, ఎరడు నక్షత్రాలు వంటి సూపర్ హిట్ సినిమాల హీరో పునీత్ రాజ్‌కుమార్ తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలోని సహజ అద్భుతాలను ఆవిష్కరించిన జాతీయ అవార్డుగ్రహీత ఉత్తమ దర్శకుడు అమోఘవర్షతో జతకట్టారు. అయితే దురదృష్టవశాత్తు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ విడుదల కాకముందే పునీత్ మరణించారు. అయితే అప్పు భార్య, అశ్విని పునీత్ రాజ్‌కుమార్.. భర్త చివరి కోరికను తీరుస్తూ.. ఈ సినిమా దాదాపు ప్రతి కన్నడిగుడికి చేరేలా చేశారు.
ನಾಡಿನ ಜನತೆಯಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಮನವಿ…
An appeal to all the people of the state.#GGKids #GGMovie #GandhadaGudi #DrPuneethRajkumar pic.twitter.com/tf01Kt2Alu
— Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) November 6, 2022
పునీత్ భార్య ట్విటర్‌లో తన జ్ఞాపకాలను మనసుకు హత్తుకునేలా ఓ సందేశాన్ని రాశారు. ఈ సినిమా తన అప్పు కల అని కర్ణాటకలోని అడవుల అందరులు ప్రతి ఒక్కరికీ తెలియాలని కోరుకున్నారని.. అందుకనే ఈ సినిమా తన భర్త చేశారని పేర్కొన్నారు. గందర గుడి అనేది అప్పు (పునీత్ రాజ్‌కుమార్) కలల ప్రాజెక్ట్. కర్నాటకలోని దట్టమైన అడవులు, ప్రకృతి అందాలు ప్రతి కన్నడిగుడికి చేరాలని కోరుకున్నారని అందుకే ఈ సినిమా చేశారని చెప్పారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడలన్నది తన భర్త కోరిక ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రం చూడాలని ఎంతగానో కోరుకున్నారు. మన పిల్లల కోసం మన అడవులను కాపాడుకుందాం. వాళ్లకి కర్ణాటక అందాలను చూపిద్దాం అని పేర్కొన్నారు అశ్విని పునీత్ రాజ్ కుమార్.
అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ పూర్తయిన కొద్ది రోజులకే పునీత్ గుండెపోటుతో మరణించారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..