Puneeth Rajkumar: గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్

హార్ట్ ఎటాక్స్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని షాడోలా వెంటాడుతున్నాయి. తండ్రి నుంచి తనయుళ్ల దాకా సేమ్ సీన్‌.

Puneeth Rajkumar: గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్
Puneeth Rajkumar

Updated on: Oct 29, 2021 | 6:15 PM

హార్ట్ ఎటాక్స్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని షాడోలా వెంటాడుతున్నాయి. తండ్రి నుంచి తనయుళ్ల దాకా సేమ్ సీన్‌. గుండెపోటుతో హఠాన్మరణం ఆనవాయితీగా వస్తోంది. పునీత్ రాజ్‌కుమార్‌ తండ్రి కన్నడ కంఠీరవ అలాగే ప్రాణాలు విడిచాడు. పనీత్ సోదరుడు శివరాజ్‌ కుమార్‌కి కూడా గుండెపోటు వచ్చింది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో సేఫ్ అయ్యాడు. కానీ పునీత్ రాజ్‌కుమార్‌ మాత్రం హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు విడిచాడు. అన్నదమ్ములిద్దరికి జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగానే డేంజర్‌ స్ట్రోక్ వెంటాడింది.

పునీత్ రాజ్‌కుమార్‌.. వెరీ ఎనర్జిటిక్ అండ్ చార్మింగ్ హీరో. ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. జిమ్‌లోనే కాదూ షూటింగ్‌ కోసం ఎక్కడికెళ్లినా వర్కవుట్స్‌ మాత్రం వదలడు. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. అలాంటి హీరో జేమ్స్‌ అనే సినిమాకు సైన్ చేశాడు. ఈ మూవీలో బాడీబిల్డర్‌గా కనిపించబోతున్నాడు. అందుకే విపరీతంగా వర్కవుట్స్ మొదలెట్టాడు. అదే ప్రాణాలు మీదకు తెచ్చినట్టు కనిపిస్తోంది.

జేమ్స్ సినిమాను చాలా ఓన్ చేసుకున్నాడు రాజ్‌కుమార్‌. బాడీ బిల్డర్‌ ఎలా ఉంటాడో అలాగే తనను తాను మలచుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఓవర్‌గా ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన జిమ్‌ సిబ్బంది, సహాయకులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. శాపంగా మారిన డేంజర్‌ స్ట్రోక్‌ రాజ్‌కుమార్‌ను బలితీసుకుంది. యావత్ సినీ పరిశ్రమను విషాదంలో ముంచింది.

Also Read: Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే..

గతంలో తెలుగు పవర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కన్నడ పవర్ స్టార్..