AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puli Seetha: నా మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నానంటే..

నటి పులి సీత తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు. ఆమె తొలి పారితోషికం ఎంతో వివరించారు. దేవర సినిమాకు ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ రంగంలో అవకాశాల కోసం ప్రతిభే ముఖ్యమని, లంచాలు వంటి అపోహలు నిజం కాదని స్పష్టం చేశారు. వెంకటేశ్, జాన్వీ కపూర్ వంటి నటులతో కలిసి పనిచేసిన అనుభవాలను వెల్లడించారు.

Puli Seetha: నా మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నానంటే..
Puli Seetha
Ram Naramaneni
|

Updated on: Apr 08, 2026 | 11:19 AM

Share

నటి పులి సీత సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి, ఎదుర్కొన్న సవాళ్లు, అందుకున్న అవకాశాల గురించి ఒక ఇంటర్వ్యూలో విస్తృతంగా చర్చించారు. సినీ రంగంలో అవకాశాల విషయంలో ఉన్న అపోహలను ఆమె తొలగించారు. మేనేజర్‌లు, కో-డైరెక్టర్‌లు, డైరెక్టర్‌ల ద్వారానే అవకాశాలు వస్తాయని, ప్రతిభకు బదులుగా ఇతరత్రా ఏమైనా ఆశిస్తారనే అభిప్రాయం తప్పు అని స్పష్టం చేశారు. ఎవరైనా సరదాగా అడిగినా, దాన్ని తేలికగా తీసుకోవచ్చని, బలవంతంగా ఎవరూ ఏమీ చేయలేదరని.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఆమె అన్నారు. ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకోగలమని పులి సీత వివరించారు.

దేవర సినిమాకు అవకాశం రావడానికి ఆమె ఆడిషన్ ప్రక్రియను ఉదాహరణగా చెప్పారు. కొరటాల శివ గారి ఆఫీసు నుంచి పిలుపురాగా, ఆడిషన్‌కు వెళ్లినట్లు తెలిపారు. సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన డైలాగ్‌ను పేపర్‌పై ఇచ్చి, అరగంట సమయం చూసుకున్న తర్వాత, తనదైన మోడ్యులేషన్‌లో చెప్పినట్లు వివరించారు. ఆ వీడియో ఆధారంగానే తనను ఎంపిక చేశారని, ప్రతిభ లేకపోతే అవకాశం దక్కేది కాదని బలంగా చెప్పారు. షూటింగ్‌లో ఎన్ని టేక్‌లు తీసుకున్నా, తన డైలాగ్ డెలివరీ, మోడ్యులేషన్ మారలేదని పేర్కొన్నారు. దేవర సినిమాకు మూడు, నాలుగు రోజులు షూటింగ్ జరిగిందని తెలిపారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ తొలి తెలుగు డైలాగ్ పులి సీతతోనే పలికారని, జాన్వీ కపూర్ అత్యంత ప్రతిభావంతురాలని, తెలుగు రాకపోయినా పట్టుదలతో నేర్చుకుని అద్భుతంగా చెప్పారని ప్రశంసించారు. దేవర సినిమా రెండు భాగాలుగా వస్తుందని, రెండో భాగంలో కూడా తన పాత్ర కొనసాగుతుందని పులి సీత వెల్లడించారు. తన తొలి పారితోషికం రూ.3,500 అని, ప్రస్తుత పారితోషికం రోజుకు రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉంటుందని తెలిపారు. కొన్నిసార్లు నెలంతా బిజీగా ఉన్నా, మరికొన్నిసార్లు రెండు, మూడు నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుందని, ఇది సినిమాను బట్టి మారుతుందని వివరించారు. బోయపాటి తీసిన వినయ విధేయ రామ, జయ జానకి నాయక వంటి సినిమాలకు ఎక్కువ రోజులు షూటింగ్ చేశానని గుర్తు చేసుకున్నారు.

సీనియర్ నటులతో కలిసి పనిచేసేటప్పుడు అనుభవాలు కూడా సీత పంచుకున్నారు. ఎఫ్3 సినిమాలో వెంకటేశ్ తో కలిసి నటించినప్పుడు, ఆయన ఎంత మంచి వ్యక్తో తెలిసిందని వివరించారు. సన్నివేశానికి సంబంధించిన డైలాగులను వెంకటేషే స్వయంగా పులి సీతతో రీహార్సల్ చేయించి, ఎలా నటించాలో సూచించినట్లు తెలిపారు. చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు అనే తేడా లేకుండా అందరితోనూ ఆయన స్నేహపూర్వకంగా ఉంటారని అన్నారు. ఎఫ్3లో “వెంకట్రావు పెళ్ళాం” అనే తన పాత్ర బాగా ప్రజాదరణ పొందిందని, దర్శకుడు అనిల్ రావిపూడి ఆ పాత్రకు మంచి పేరు వస్తుందని చెప్పినట్లు పులి సీత గుర్తుచేసుకున్నారు.

Also Read: ఎవరైనా ఒక టీ తాగిస్తే బాగుండు అనుకున్న రోజుల నుంచి.. ఆ తర్వాత ఈ స్థాయికి.. 

Follow Us