RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై ఇప్పుడు యావత్ దేశం ఎదురుచూస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమా తెరకెక్కించారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో గిరిజన వీరుడు అల్లూరి సీతారామరాజుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అలాగే అల్లూరి సీత రామరాజుగా మెగా పవర్ స్టార్ రామ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేశారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌తో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ప్రకటించారు కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడిందని ప్రకటించారు. దేశంలో కరోనా తో పాటు కొత్త వేరియంట్ ఓమైక్రాన్ కూడా వ్యాపిస్తుండటం తో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కొత్త తలనొప్పి వచ్చి పడింది.
ఆర్ఆర్ఆర్ సినిమా పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఆర్ఆర్ఆర్ సినిమా పై పిల్ దాఖలు చేశారు. అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని ఆమె పిల్ పేర్కొన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ను ఆమె కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం వద్దకు వెళ్ళింది ఈ పిల్. పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తెలిపారు. మరి ఈ విషయం పై ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :