Chor Bazar : చోర్ బజార్ అనేది 400 ఏళ్లుగా ఉంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత వి.ఎస్ రాజు

|

Jun 19, 2022 | 5:48 PM

యంగ్ హీరో ఆకాష్ పూరి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Chor Bazar : చోర్ బజార్ అనేది 400 ఏళ్లుగా ఉంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత వి.ఎస్ రాజు
Producer Vs Raju
Follow us on

యంగ్ హీరో ఆకాష్ పూరి(Akash Puri) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్(Chor Bazar). చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాష్.. రీసెంట్ గా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు చోర్ బజార్ సినిమాతో రాబోతున్నాడు. గెహనా సిప్పీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఈనెల 24న యూవీ క్రియేషన్స్ సమర్పణలో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా విషయాలను పంచుకున్నారు నిర్మాత వీఎస్ రాజు.

ఆయన మాట్లాడుతూ.. చోర్ బజార్ అనేది హైదరాబాద్ లో 400 ఏళ్లుగా ఉంది. నిజాం కాలంలో దొంగతనం
చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ అలాగే అమ్ముతుంటారు. ప్రతి గురువారం అక్కడ ఈ అమ్మకాలు జరుగుతుంటాయి. నేను మా టీమ్ కూడా చోర్ బజార్ లో వస్తువులు కొన్నాం అన్నారు. అలాగే ఆకాష్ ఈ కథకు పర్పెక్ట్ సరిపోయాడు. కథ విన్నాక ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నాడు. ఈ కథకు రెండు మూడు సినిమాలు చేసిన హీరోనే సరిపోతాడు. ఈ సినిమాతో ఆకాష్ కు మంచి పేరొస్తుంది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు పెట్టామనేది సినిమాలో చూడండి. ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఆ పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ చేశాం అన్నారు వీఎస్ రాజు. సీనియర్ నటి అర్చన గారు మదర్ పాత్రలో నటించారు. 25 ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. చోర్ బజార్ రాత్రి జరిగే కథ 35 రోజుల వరకు కేవలం రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి అని చెప్పుకొచ్చారు నిర్మాత.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి